Steve Smith: ఐపీఎల్ కామెంటేటర్ గా ఆసీస్ స్టార్

Australia former captain Steve Smith turns IPL commentator

  • కామెంటేటర్ గా స్టీవ్ స్మిత్
  • మార్చి 22 నుంచి ఐపీఎల్ తాజా సీజన్
  • స్టార్ స్పోర్ట్స్ తో స్మిత్ ఒప్పందం!

ఈ నెల 22 నుంచి దేశంలో ఐపీఎల్ మేనియా షురూ కానుంది. ఎప్పట్లాగానే హేమాహేమీలైన మాజీ క్రికెటర్లు ఐపీఎల్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈసారి వారితో ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్ స్మిత్ జత కలవనున్నాడు. మైదానంలో పరుగుల వరద పారించే స్మిత్ ఇంగ్లీష్ కామెంట్రీ బాక్స్ లో ఎలా అలరిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఐపీఎల్ కామెంటేటర్ గా వ్యవహరించేందుకు స్మిత్ స్టార్ స్పోర్ట్స్ చానల్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. 

కాగా, ఐపీఎల్-2024 సీజన్ కోసం స్టార్ స్పోర్ట్స్ ఇంగ్లీష్ కామెంటరీ బృందం భారీగానే ఉంది. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్ష భోగ్లే, బ్రియాన్ లారా, మాథ్యూ హేడెన్, సంజయ్ మంజ్రేకర్, స్టీవ్ స్మిత్, స్టూవర్ట్ బ్రాడ్, డేల్ స్టెయిన్, జాక్ కలిస్, టామ్ మూడీ, జెర్మనోస్, హోవార్డ్, డారెన్ గంగా, రోహన్ గవాస్కర్, ఆరోన్ ఫించ్, రామన్, పాల్ కాలింగ్ వుడ్, మురళీ కార్తీక్, కెవిన్ పీటర్సన్, అంజుమ్ చోప్రా, మైకేల్ క్లార్క్, ఎంబాగ్వా, దీప్ దాస్ గుప్తా, గ్రేమ్ స్వాన్, ఇయాన్ బిషప్, కేటీ, శామ్యూల్ బద్రీ, నిక్ నైట్, సైమన్ కాటిచ్, క్రిస్ మోరిస్, డానీ మోరిసన్ లతో కామెంటేటర్స్ లిస్టు భారీగానే ఉంది.

Steve Smith
Commentator
IPL-2024
Star Sports
  • Loading...

More Telugu News