Chandrababu: ఐదేళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమే: చంద్రబాబు

Chandrababu tweets on election schedule

  • ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన ఈసీ
  • ఏపీలో మే 13న పోలింగ్... జూన్ 4న కౌంటింగ్
  • జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్న చంద్రబాబు
  • ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని వెల్లడి  

కేంద్ర ఎన్నికల సంఘం నేడు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఐదేళ్లుగా ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు ఎదురు చూసింది ఈ రోజు కోసమేనని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చింది... జగన్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది... ఇక పోలింగే మిగిలింది అని ట్వీట్ చేశారు. ఒక్క చాన్స్ ప్రభుత్వానికి ఒక నో చాన్స్ అని ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ప్రజాగళం వినిపించే రోజు వచ్చింది అని చంద్రబాబు వివరించారు. నవశకం వైపు ప్రయాణంలో తొలి అడుగుకు స్వాగతం పలుకుదాం అని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రానికి అన్నీ మంచి రోజులేనని తెలిపారు. ఏపీలో మే 13న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తుండగా, జూన్ 4న కౌంటింగ్ జరగనుంది.

Chandrababu
General Elections
Schedule
TDP
Jagan
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News