: భద్రాచలంలో భక్తుల కిటకిట
జానకిరాముడు కొలువై ఉన్న ఖమ్మం జిల్లా భద్రాచలం రామాలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ముగుస్తుండడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రాముడిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో భక్తుల తాకిడి పెరిగింది. స్వామివారి నిత్య కల్యాణంలో కూడా భక్తులు పాల్గొంటున్నారు.