Ambati Rambabu: అప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు.. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు.. ఇదీ బాబు నైజం: అంబ‌టి రాంబాబు

YCP Leader Ambati Rambabu Criticizes Chandrababu Naidu

  • బీజేపీతో టీడీపీ పొత్తుపై ట్విట‌ర్ వేదిక‌గా అంబ‌టి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు
  • గ‌తంలో ప్ర‌ధాని మోదీపై చంద్ర‌బాబు చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసిన వైసీపీ నేత‌
  • అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు గారి నైజం అంటూ విమ‌ర్శ‌

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ‌ బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైన విషయం తెలిసిందే. ఇలా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ నేత‌ అంబటి రాంబాబు 'ఎక్స్' ( గ‌తంలో ట్విట‌ర్‌) వేదికగా త‌న‌దైన శైలిలో స్పందించారు. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. 

"అప్ప‌ట్లో ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు బాబు. ఆ సమ‌యంలో ప్రధాని మోదీని టెర్రరిస్ట్ అని కూడా అన్నాడు. కానీ అప్పుడు ఎవరినైతే టెర్రరిస్ట్ అని అన్నాడో.. ఆ టెర్రరిస్ట్ కాళ్ళనే నేడు చంద్రబాబు పట్టుకుంటున్నాడు. అందితే జుట్టు.. అందకపోతే కాళ్ళు.. ఇదీ బాబు గారి నైజం అర్దమయ్యిందా..?" అంటూ అంబటి రాంబాబు త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Ambati Rambabu
Chandrababu Naidu
PM Modi
Twitter
Andhra Pradesh
  • Loading...

More Telugu News