Arvind Kejriwal: కేజ్రీవాల్ కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు

Kejriwal gets bail

  • రౌస్ అవెన్యూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన కేజ్రీవాల్
  • ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • కోర్టు నుంచి నేరుగా నివాసానికి బయల్దేరిన కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గొప్ప ఊరటను కల్పించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఇప్పటి వరకు పంపిన ఎనిమిది సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో, ఈ విషయంపై ఈడీ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు కోర్టులో కేజ్రీవాల్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేల వ్యక్తిగత పూచీకత్తు, రూ. లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే ఆయన కోర్టు నుంచి నేరుగా నివాసానికి బయల్దేరారు. కోర్టు బెయిల్ ఇవ్వడం కేజ్రీవాల్ కు పెద్ద ఉపశమనంగా చెప్పుకోవచ్చు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఆప్ కు ఇది పెద్ద ఊరటగా భావించవచ్చు.

Arvind Kejriwal
AAP
Bail
Delhi Liquor Scam
  • Loading...

More Telugu News