Sujitha: డైరెక్టర్ సూర్యకిరణ్ మృతిపై సుజిత భావోద్వేగం

Sujitha emotional post on her bother Surya Kiran death

  • అనారోగ్య కారణాలతో మృతి చెందిన సూర్యకిరణ్
  • నీవు నా హీరో, నా తండ్రి అన్న సుజిత
  • మరో జన్మ ఉంటే నీ కలలు సాకారం కావాలని ఆకాంక్ష

సినీ దర్శకుడు సూర్యకిరణ్ అనారోగ్య కారణాలతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన చెల్లెలు సుజిత తన అన్నను తలచుకుని ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. 'అన్నా, మీ ఆత్మకు శాంతి చేకూరాలి. నువ్వు నా అన్నవు మాత్రమే కాదు. నా హీరో, నా తండ్రి. నీ ప్రతిభకు, నీ ప్రసంగాలకు నేను ఎప్పుడూ అభిమానినే. మరో జన్మ అంటూ ఉంటే... అప్పుడైనా నీ కలలన్నీ సాకారం కావాలని దేవుడిని ప్రార్థిస్తున్నా' అంటూ భావోద్వేగానికి గురయింది. సుజిత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చిరంజీవి చిత్రం 'పసివాడి ప్రాణం' చిత్రంలో ఆమె అబ్బాయి పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ తో ఆమె బిజీగా ఉంటోంది.

More Telugu News