Narendra Modi: హైదరాబాద్ లో కొనసాగుతున్న మోదీ రోడ్ షో

Modi Road Show in Malkajgiri

  • మల్కాజ్ గిరి నియోజకవర్గంలో మోదీ రోడ్ షో
  • మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు రోడ్ షో
  • రోడ్ షోలో పాల్గొన్న కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. నగరంలోని మల్కాజ్ గిరి నియోజకవర్గంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్నారు. మీర్జాలగూడ నుంచి మల్కాజ్ గిరి వరకు రోడ్ షో కొనసాగనుంది. విజయ్ సంకల్ప్ పేరుతో ఈ రోడ్ షోను నిర్వహిస్తున్నారు. ఈ రోడ్ షోలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. 

రోడ్ షో కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆ ప్రాంతమంతా భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగుతోంది. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ బీజేపీ శ్రేణులు నినదిస్తున్నారు. మోదీ రోడ్ షో సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. రోడ్ షో తర్వాత రాజ్ భవన్ కు చేరుకుంటారు. ఈ రాత్రికి ఆయన రాజ్ భవన్ లోనే బస చేస్తారు.

Narendra Modi
BJP
Hyderabad
Road Show
  • Loading...

More Telugu News