IPL 2024: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మ‌నీలో సంద‌డి చేసే స్టార్లు వీరే...!

AR Rahman will perform on the opening ceremony of IPL 2024
  • వారం రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం 
  • ఓపెనింగ్ సెర్మ‌నీకి ఏఆర్ రెహ‌మాన్, సోనూ నిగ‌మ్‌, టైగ‌ర్ ష్రాఫ్‌, అక్ష‌య్ కుమార్
  • ఈ నెల 22వ తేదీన చెన్నైలోని చెపాక్ వేదిక‌గా తొలి మ్యాచ్
మ‌రో వారం రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానుంది. అయితే, ఈ 17వ ఐపీఎల్ సీజ‌న్ ప్రారంభ వేడుక‌లు చాలా ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఓపెనింగ్ సెర్మ‌నీకి ఆస్కార్ అవార్డ్ విజేత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ పెర్ఫార్మెన్స్ ఇవ్వ‌నున్నారు. రెహ‌మాన్‌తో పాటు గాయ‌కుడు సోనూ నిగ‌మ్‌, బాలీవుడ్ న‌టులు టైగ‌ర్ ష్రాఫ్‌, అక్ష‌య్ కుమార్ కూడా ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన‌నున్నారు. వీరితో పాటు మ‌రికొంత మంది సెల‌బ్రిటీలు కూడా ఈ వేడుక‌లో సంద‌డి చేయ‌నున్నార‌ని స‌మాచారం. 

ఇక ఈ నెల 22న ఐపీఎల్‌-2024 ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య తొలి మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. రాత్రి 8 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అలాగే 23న రెండు మ్యాచులు ఉన్నాయి. మొద‌టి మ్యాచ్‌లో పంజాబ్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌ల‌ప‌డితే.. రెండో మ్యాచ్‌లో కోల్‌క‌తా, స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ బ‌రిలోకి దిగ‌నున్నాయి.
IPL 2024
Opening ceremony
AR Rahman
Akshay Kumar
Sonu Nigum

More Telugu News