danam nagendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్

Danam Nagender meets CM Revanth Reddy

  • ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
  • కార్యక్రమంలో భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. శుక్రవారం ఆయన ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎంను కలిసిన సమయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో కీలక నేతల్లో దానం నాగేందర్ ఒకరు. దానం నాగేందర్ 1994, 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2004 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. 2009లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. వైఎస్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. 2018లో కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

danam nagendar
Telangana
BRS
Congress
Revanth Reddy
  • Loading...

More Telugu News