Mallu Bhatti Vikramarka: రుణాలివ్వడం సామాజిక బాధ్యతగా గర్తించాలి: బ్యాంకర్లతో మల్లు భట్టివిక్రమార్క

Bhattivikramarka suggestion to bankers

  • వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలను బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచన
  • వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని సలహా 
  • బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించాలన్న భట్టివిక్రమార్క

వ్యవసాయం, హౌసింగ్, విద్యా రుణాలను బ్యాంకర్లు ప్రాధాన్యతగా తీసుకోవాలని... రుణాలివ్వడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లో ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతులు, నిరుద్యోగులకు రుణాల ఇచ్చే విషయంలో బ్యాంకర్లు ఆస్తులను తప్పనిసరిగా తాకట్టు పెట్టుకోవడం సరైంది కాదన్నారు. వ్యాపారంలో విఫలమైన ఈము రైతులకు రుణాల చెల్లింపులో వన్ టైం సెటిల్మెంట్ చేయాలని సూచించారు.

స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలన్నారు. వచ్చే అయిదేళ్లలో డ్వాక్రా సంఘాల మహిళలకు లక్ష కోట్ల రుణాలు ఇస్తామన్నారు. మహిళలకు ఇచ్చే వడ్డీలేని రుణాల డబ్బులను బ్యాంకర్లకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని... కాబట్టి బ్యాంకర్లు వ్యాపారాలను ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని రకాల వనరులు అందుబాటులో ఉన్నాయని... ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News