Ananya Nagalla: రేపు విడుదలవుతున్న సినిమాలివే!

- ఈ నెల 15న విడుదలవుతున్న 'తంత్ర'
- క్షుద్ర ప్రయోగాల నేపథ్యంలో నడిచే కథ
- అదే రోజున వస్తున్న 'షరతులు వర్తిస్తాయి'
- చైతన్యరావు జోడీగా కనిపించనున్న భూమి శెట్టి
- 'వెయ్ దరువెయ్'తో యాశ తొలి పరిచయం
- అదే రోజున పలకరించనున్న 'రజాకార్'
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర సందడి చేయడానికి నాలుగు సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. ఆ జాబితాలో 'తంత్ర' .. 'షరతులు వర్తిస్తాయి' .. ' వెయ్ దరువెయ్' .. ' రజాకార్' కనిపిస్తున్నాయి. నాలుగు సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్ నుంచి వస్తున్నాయి. 'తంత్ర' సినిమాపై బజ్ ఎక్కువగా కనిపిస్తోంది. అనన్య నాగళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తాంత్రిక శక్తుల నేపథ్యంలో కొనసాగుతుంది.


