Yamuna: ఆ సినిమా కోసం ఫారెస్టులో చెప్పులు లేకుండా పరిగెత్తాను .. ముళ్లతో ఒళ్లంతా గాయాలు: నటి యమున

Yamuna Interview

  • 'మౌనపోరాటం'లో అలా ఛాన్స్ తగిలిందన్న యమున
  • గిరిజన యువతిగా చాలా కష్టపడ్డానని వ్యాఖ్య  
  • ఒళ్లంతా ముళ్లు గీసుకుపోయాయని వెల్లడి 
  • వర్మ గారు ఛాన్స్ ఇస్తారనుకోలేదని వివరణ


యమున .. 'మౌనపోరాటం' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా తరువాత నుంచే కథానాయికగా ఆమె బిజీ అయ్యారు. తాజాగా 'తెలుగు వన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆ సినిమాను గురించి ప్రస్తావించారు. 'మౌనపోరాటం'లోని పాత్ర కోసం చాలామందిని పరిశీలించారు. కానీ నాతోనే ఆ పాత్రను చేయించమని రామోజీరావుగారు చెప్పారు" అని అన్నారు. 

"ఇక ఈ సినిమా షూటింగును 'అరకు' సమీపంలోని ఫారెస్టులో చిత్రీకరించారు. ఈ సినిమాలో నేను గిరిజన యువతిగా చేశాను. అందువలన కాళ్లకు చెప్పులు ఉండవు. అలా చెప్పులు లేకుండానే ఒక షాట్ లో దర్శకుడు నన్ను పరిగెత్తించారు. అక్కడ విపరీతమైన ముళ్లు .. ముళ్లపొదలు ఉన్నాయి. పాదాల్లో ముళ్లు దిగబడ్డాయి .. ఒళ్లంతా ముళ్లు గీసుకుపోయి రక్తం వచ్చేసింది" అని చెప్పారు. 

"ఇప్పటికీ నాకు ఆ సన్నివేశం గుర్తుకు వస్తూనే ఉంటుంది. అంతగా ఆ సినిమా కోసం పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించింది. ఈ పాత్రను ఈ అమ్మాయి మాత్రమే చేయగలదు అనే మంచి పేరు వచ్చింది. ఇక ఆ తరువాత కాలంలో నేను 'బంగారు కుటుంబం' షూటింగులో ఉండగా, వర్మగారు అలా వెళుతూ నన్ను చూశారు. ఆ మరుసటి రోజే నన్ను పిలిపించి 'గోవిందా గోవిందా' సినిమాలో లక్ష్మీదేవి పాత్రను ఇచ్చారు. ఆ సంఘటన కూడా ఎప్పటికీ మరిచిపోలేను" అని చెప్పారు. 

  • Loading...

More Telugu News