Muralimohan: శ్రీదేవి తరువాత అంతటి అందగత్తె ఆమెనే: నటుడు మురళీమోహన్

Muralimohan Interview

  • శ్రీదేవి బిహేవియర్ గొప్పదన్న మురళీమోహన్ 
  • ఆమె అంతటి గ్లామర్ దీపకి ఉండేదని వ్యాఖ్య 
  • దీప లావుకావడానికి కారణమదేనని వెల్లడి 
  • జయసుధ గొప్పనటి అంటూ కితాబు  


మురళీమోహన్ .. కథానాయకుడిగా అనేక సినిమాలు చేశారు. శోభన్ బాబు .. కృష్ణ .. కృష్ణంరాజు .. వంటి హీరోలను తట్టుకుని నిలబడ్డారు. అలాంటి ఆయన 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. " జీవితంలో నా కారణంగా నా కుటుంబ సభ్యులెవరూ తలదించుకోకూడదనే ఒక ఆలోచన .. అందుకోసం పాటించిన క్రమశిక్షణ నన్ను ఇంతవాడిని చేసింది" అని అన్నారు. 

"నేను చూసిన హీరోయిన్స్ లో చాలా గ్లామరస్ గా కనిపించింది శ్రీదేవిగారు. తాను చాలా అందంగా ... ఆకర్షణీయంగా ఉండేవారు. ఆమె బిహేవియర్ కూడా చాలా పద్ధతిగా ఉండేది. ఆ తరువాత అంతటి అందగత్తె 'దీప' అనే చెప్పాలి. చాలా చిన్న వయసులో ఆమె ఇండస్ట్రీకి వచ్చింది. షూటింగు స్పాట్ లో ఏ మాత్రం గ్యాప్ దొరికినా వాళ్ల అమ్మగారు డ్రై ఫ్రూట్స్ పెడుతుండేవారు. అందుకేనేమో ఆ తరువాత ఆమె కొంచెం లావయ్యారు" అని చెప్పారు. 

"ఇక నాతో హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేసింది జయసుధ గారు. ఒక పాత్రకి ఎంతవరకూ మేకప్ ఉండాలనే విషయంలో ఆమెకి మంచి అవగాహన ఉంది. చాలా సింపుల్ గా మేకప్ చేసుకుని వచ్చేవారు. మధ్యతరగతి ఇల్లాలి పాత్ర అంటే, అచ్చం అలాగే కనిపించేవారు. ఆమె నటిస్తున్నట్టుగా కాకుండా చాలా సహజంగా చేసేవారు" అని అన్నారు. 

Muralimohan
Sridevi
Deepa
  • Loading...

More Telugu News