babu mohan: కేఏ పాల్ అక్కడి నుంచే పోటీ చేస్తారు: బాబు మోహన్

Babu Mohan clarity on KA Paul contest and his support

  • కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని బాబు మోహన్ వెల్లడి
  • కేఏ పాల్‌కు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని స్పష్టీకరణ
  • వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేస్తారని గతంలోనే ప్రకటించిన కేఏ పాల్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత కేఏ పాల్ విశాఖ లోక్ సభ స్థానం నుంచి బరిలో నిలుస్తారని... ఆయనకు మద్దతుగా తాను ప్రచారం చేస్తానని ఇటీవలే ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్ స్పష్టం చేశారు. ఇటీవల కేఏ పాల్ మాట్లాడుతూ... తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని, బాబు మోహన్ తెలంగాణలోని వరంగల్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా కేఏ పాల్ పోటీపై బాబు మోహన్ మరోసారి స్పందించారు. ఇదిలా ఉండగా మునుగోడు ఉప ఎన్నికల్లో కేఏ పాల్‌కు 805 ఓట్లు రాగా, 2019లో నర్సాపురం అసెంబ్లీ స్థానానికి పోటీ చేయగా 281 ఓట్లు వచ్చాయి.

babu mohan
Telangana
Andhra Pradesh
KA Paul
Lok Sabha Polls
  • Loading...

More Telugu News