KA Paul: కేఏ పాల్ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

AP High Court takes up KA Paul petition for hearing

  • ఏపీలో ఏప్రిల్ లో ఎన్నికలు, మేలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారన్న కేఏ పాల్
  • ఎన్నికలు కూడా మేలోనే జరిపితే వెంటనే ఓట్లు లెక్కిస్తారంటూ పిటిషన్
  • ఎన్నికల వెంటనే ఓట్ల లెక్కింపు వల్ల ఈవీఎం ట్యాంపరింగ్ కు అవకాశం ఉండదని వెల్లడి
  • కేఏ పాల్ పిల్ పై తగిన నిర్ణయం తీసుకోవాలంటూ ఈసీని ఆదేశించిన కోర్టు

ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ లో నిర్వహించి, ఓట్లను మేలో లెక్కించడం ఏంటని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏపీలో ఎన్నికలు మే నెలలో చివరి ఫేజ్ లో నిర్వహించాలని, తద్వారా ఈవీఎం ట్యాంపరింగ్ కు అవకాశం లేకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ వెంటనే జరుగుతుందని తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొన్నారు. 

కేఏ పాల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ పై తగిన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

కాగా, ఇవాళ జనసేనాని పవన్ కల్యాణ్ మంగళగిరిలోని తమ పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ, మే 15 తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉండడానికి వీల్లేదు అని వ్యాఖ్యానించారు. బహుశా ఓట్ల లెక్కింపు ఎప్పుడు జరిగేది తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగానే ఆయన ఆ తేదీని ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

More Telugu News