Mallu Bhatti Vikramarka: మహిళలు తీసుకునే రుణాలకు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది: మల్లు భట్టివిక్రమార్క

Mallu Bhattivikramarka says will give free loans to women
  • సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం
  • ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడి
  • 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడి
మహిళలకు తమ ప్రభుత్వం వడ్డీలేని రుణాలు ఇస్తుందని... ఈ రుణాలకు ప్రభుత్వమే వడ్డీని చెల్లిస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో మహాలక్ష్మి స్వశక్తి మహిళా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు. 6.10 లక్షల స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. 64 లక్షల మంది మహిళలను లక్షాధికారులను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
BRS

More Telugu News