Kodali Nani: దత్తపుత్రుడు పవన్, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, 420 చంద్రబాబు.. ఏమీ చేయలేరు!: కొడాలి నాని

Kodali Nani fires on Chandrababu

  • మోదీని చంద్రబాబు నానా బూతులు తిట్టారని వ్యాఖ్య
  • పార్టీని పెట్టింది అమ్ముకోవడానికా అని పవన్ పై విమర్శ
  • జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే పరిస్థితి లేదన్న నాని  

దత్తపుత్రుడు పవన్, బీజేపీ వదినమ్మ, కాంగ్రెస్ చెల్లెమ్మ, 420 చంద్రబాబు వీరంతా కలిసొచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మోదీని చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నో తిట్లు తిట్టారని చెప్పారు. మోదీని చంద్రబాబు నానా బూతులు తిట్టారని, ఈ దేశాన్ని మోదీ దోచుకున్నారని అన్నారని తెలిపారు. ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అన్నది పవన్ కాదా? అని ప్రశ్నించారు. తన తల్లిని దూషించారు, టీడీపీ అంతం చేస్తానని పవన్ కల్యాణ్ గతంలో ప్రగల్బాలు పలికారని చెప్పారు.  

రాష్ట్రం నాశనమయిందని అందరూ కలిసినట్టు చెపుతున్నారని... ప్రజలకు సంక్షేమం అందిస్తున్నందుకు రాష్ట్రం నాశనం అయిందా? అని ప్రశ్నించారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, జెట్టీలను నిర్మించినందుకు రాష్ట్ర నాశనం అయిందా? అని అడిగారు. 

ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకున్నారని... ఇప్పుడు సిగ్గు లేకుండా అందరూ కలిసి వస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. జగన్ ను ఓడించడమే అన్ని పార్టీల లక్ష్యమని చెప్పారు. పవన్ కల్యాణ్ 21 సీట్లకు వచ్చారని... పార్టీని పెట్టింది అమ్ముకోవడానికా? అని ప్రశ్నించారు. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే పరిస్థితి లేదని చెప్పారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అట్టర్ ఫ్లాప్ అని అన్నారు.

Kodali Nani
Jagan
YSRCP
Chandrababu
Telugudesam
Pawan Kalyan
Janasena
Narendra Modi
BJP
Congress
  • Loading...

More Telugu News