Surekha Vani: అతడితో ఒక గంట మాట్లాడే అవకాశం ఇవ్వాలని దేవుడ్ని కోరుకుంటున్నా: సురేఖా వాణి

Surekha Vani said she wants to talk deceased husband

  • భర్త చనిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లానన్న సురేఖా వాణి
  • భర్త తరఫు బంధువులు తనను అర్థం చేసుకోలేదని ఆవేదన
  • ఆ సమయంలో కుమార్తె అండగా నిలిచిందని వెల్లడి 

టాలీవుడ్ నటి సురేఖా వాణి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరణం తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని వెల్లడించారు. ఆ సమయంలో తన కుమార్తె తనకు అండగా నిలిచిందని తెలిపారు. తన భర్త తనను ఎంతో గౌరవించాడని, తాను కూడా అతడ్ని బాగానే చూసుకున్నానని వివరించారు. 

భర్త అనారోగ్యంతో ఆసుపత్రిపాలైనప్పుడు తాను కూడా అక్కడే ఉన్నానని, కానీ భర్త తరఫు బంధువులు తనను తప్పుగా అర్థం చేసుకున్నారని సురేఖా వాణి ఆవేదన వ్యక్తం చేశారు. భర్త ఆరోగ్యం క్షీణించడంతో ఎంతగానో ఏడ్చానని, అతడు తన జీవితంలోంచి వెళ్లిపోయాక తాను పడిన బాధ వర్ణనాతీతం అని పేర్కొన్నారు. 

"నేను నా భర్తను అడగాల్సినవి కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా, క్షమించమని అడగాలని ఉంది. దేవుడు కనీసం ఒక గంట అయినా నా భర్తతో మాట్లాడే అవకాశం కల్పిస్తే బాగుండు. కనీసం కలలో అయినా నా భర్త కనిపిస్తే మాట్లాడాలనుకుంటున్నా" అంటూ సురేఖా వాణి కన్నీటిపర్యంతమైంది.

Surekha Vani
Husband
Actress
Tollywood
  • Loading...

More Telugu News