Sonu Sood: ఖమ్మంలో సోనూ సూద్ కూరగాయల దుకాణం.. యాక్టర్ ట్వీట్ వైరల్

Sonu Sood Tweet Gone Viral In Social Media Platforms

  • ఇప్పుడు తనకు కూరగాయల షాప్ కూడా ఉందన్న బాలీవుడ్ నటుడు
  • కరోనా సమయంలో అప్పు చేసి మరీ పేదలను ఆదుకున్న సోనూ సూద్
  • ప్రతీ ఒక్కరి గుండెల్లో మీరు ఉంటారంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

కరోనా కష్ట కాలంలో బాలీవుడ్ యాక్టర్ సోనూ సూద్ ఎంతోమందిని ఆదుకున్నాడు.. సొంత డబ్బులు ఖర్చు చేసి సాయం చేశాడు. అప్పులు చేసి, ఆస్తులు తాకట్టు పెట్టి మరీ ఆపదలో ఉన్న వారికి అండగా నిలిచాడు. తెరపై విలన్ గా కనిపించినా నిజజీవితంలో హీరోనని చాటుకున్నారు. ఆయన సేవలు అందుకున్న వారు వివిధ రకాలుగా తమ కృతజ్ఞత చాటుకుంటున్నారు. తాజాగా ఖమ్మంలో ఓ మహిళ సోనూ సూద్ పేరుతో కూరగాయల దుకాణం ప్రారంభించింది. ఆ దుకాణంలో కూరగాయలు కొన్న వారు షాపు ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఫొటో వైరల్ గా మారి సోనూ సూద్ వరకూ చేరింది.

దీంతో ఆయన ఈ ఫొటోను రీట్వీట్ చేస్తూ.. ఇప్పుడు నాకు కూరగాయల షాప్ కూడా ఉందంటూ కామెంట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నెటిజన్లు తమ కామెంట్లలో ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రతీ ఒక్కరి గుండెల్లో మీరు కలకాలం నిలిచి ఉంటారని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా.. ఇండియా మొత్తం మిమ్మల్ని ప్రేమిస్తోందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మీపై ఉన్న ప్రేమకు ప్రతిరూపం ఆ దుకాణం అని, ఈ గౌరవానికి మీరు వందశాతం అర్హులంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

Sonu Sood
Vegetable Shop
Khammam
Bollywood Hero
COVID19
Social Service
  • Loading...

More Telugu News