: యువతి కడుపులో ఐదడుగుల వాలు జడ!
ఎవరైనా ఆకలేస్తే అన్నం తింటారు. లేదా మరేదైనా ఆహార పదార్థం తీసుకుంటారు. కానీ ఉత్తరప్రదేశ్ లోని ఫరీదాబాద్ కు చెందిన 14 ఏళ్ల సుకన్య ఆకలేస్తే తన జుట్టును తినేది. అలా కడుపులోకి చేరిన జుట్టు జడగా మారింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న సుకన్యను తల్లిదండ్రులు వైద్యుల వద్దకు తీసుకెళ్లగా స్కాన్ చేసి కడుపులో జుట్టు ఉన్నట్లు గుర్తించారు. సర్జరీ చేసి బయటకు తీయగా, ఆ జడతాడు ఐదడుగులు ఉన్నట్లు తేలింది. ఆలస్యమైతే సుకన్య ప్రాణం కోల్పోయేదని వైద్యులు చెప్పారు.