Nama Bhavya Teja: కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన నామా నాగేశ్వరరావు

Nama Nageswara Rao invites Chandrababu to his son Bhavya Teja Marriage

  • హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసంలో ఆహ్వాన పత్రిక అందజేత
  • ఇప్పటికే కేసీఆర్ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించిన నామా
  • ఈ నెల 15న జరగనున్న భవ్యతేజ వివాహం

తన రెండో కుమారుడు నామా భవ్యతేజ వివాహానికి ఆహ్వానిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆహ్వానపత్రిక అందజేశారు. కుమారుడితో కలిసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన నామా ఆహ్వానపత్రికను చంద్రబాబుకు అందించి తప్పకుండా రావాలని కోరారు.

కాగా, ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు నేతలు, ప్రముఖులను నామా ఆహ్వానించారు. కాగా, ఈ నెల 15న భవ్యతేజ-శేష మనోజ్ఞజ్యోతి వివాహం జరగనుంది.

More Telugu News