Virat Kohli: హుక్కా పీలుస్తూ కెమెరాకు చిక్కిన కోహ్లీ..  ఫొటో వైరల్

Virat Kohli Caught Smoking Hookah

  • 'వన్ 8' రెస్టారెంట్ లో హుక్కా తాగిన కోహ్లీ
  • ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న నెటిజెన్లు
  • ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్న కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ కు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తాడో అందరికీ తెలిసిందే. ఫిట్ నెస్ విషయంలో కోహ్లీని ఒక ఐకాన్ లా యూత్ భావిస్తుంటారు. అలాంటి కోహ్లీ ఇప్పుడు హుక్కా పీలుస్తూ కెమెరా కంటికి చిక్కాడు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు చెందిన 'వన్ 8' రెస్టారెంట్ లో కోహ్లీ హుక్కా ఎంజాయ్ చేశాడు. కోహ్లీ హుక్కా తాగడంపై నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ తో జరిగిన 5 టెస్టుల సిరీస్ కు కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన భార్య అనుష్క డెలివరీ నేపథ్యంలో కోహ్లీ లండన్ కు వెళ్లాడు. లండన్ లో అనుష్క మగబిడ్డకు జన్మనిచ్చింది. 

Virat Kohli
Team India
Hookah
  • Loading...

More Telugu News