Murder Mubarak: మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే 'మర్డర్ ముబారక్' .. నెట్ ఫ్లిక్స్ లో !

Murder Mubarak Movie Update

  • సారా అలీఖాన్ నుంచి 'మర్డర్ ముబారక్'
  • మర్డర్ మిస్టరీ నేపథ్యంలో నడిచే కథ 
  • ప్రధానమైన బలంగా నిలిచే బాలీవుడ్ స్టార్స్ 
  • ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్  


ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై 'మర్డర్ మిస్టరీ' కథలకు మంచి క్రేజ్ ఉంది. అందువలన ఆ తరహా కథలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి ఎక్కువగా వస్తున్నాయి. అలా త్వరలో నెట్ ఫ్లిక్స్ సెంటర్ కి 'మర్డర్ ముబారక్ ' సినిమా రానుంది.  ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నారు. అందువలన జోరుగా ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. 

ఈ సినిమా ఒక మర్డర్ .. ఏడుగురు అనుమానితుల చుట్టూ తిరుగుతుంది. ఏడుగురిలో ఎవరు ఆ మర్డర్ చేశారనేది దాగుడుమూతలను గుర్తుచేసేలా కొనసాగుతుంది. ఈ కథ సస్పెన్స్ తో ముడిపడినప్పటికీ, కామెడీ టచ్ తో కొనసాగుతుంది. మడాక్ ఫిల్మ్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాకి, హమీ అడజానియా దర్శకత్వం వహించాడు. 

పంకజ్ త్రిపాఠి .. సారా అలీఖాన్ .. విజయ్ వర్మ .. డింపుల్ కపాడియా .. కరిష్మా కపూర్ .. సంజయ్ కుమార్ తదితరులు నటించారు. అంతా స్టార్ ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు కావడం వలన, భారీ బడ్జెట్ తో నిర్మించినది కావడం వలన అందరిలో ఆసక్తి ఉంది. అనూజా చౌహన్ రాసిన 'క్లబ్ యు టు డెత్' అనే పుస్తకం ఆధారంగా ఈ సినిమా నిర్మితమైంది. 

More Telugu News