Asaduddin Owaisi: ఎన్నికల కమిషనర్ రాజీనామాకు కారణమేంటో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెప్పాలి: ఒవైసీ

Owaisi on Arun Goel resignation

  • కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా
  • బీజేపీ ఒత్తిడే కారణమని విమర్శిస్తున్న విపక్షాలు
  • ఎన్నికల ముందు ఈ పరిణామం షాక్ కు గురి చేసిందన్న ఒవైసీ

కేంద్ర ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామా చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఒత్తిడి కారణంగానే ఆయన రాజీనామా చేశారని విపక్ష పార్టీల నేతలు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ... రాజీనామాకు గల కారణమేంటో గోయల్ పేర్కొనలేదని... అరుణ్ గోయల్ రాజీనామాకు కారణమేంటో కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం తనను షాక్ కు గురి చేసిందని చెప్పారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి పార్లమెంటులో బిల్లు తీసుకొచ్చినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలను విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు.

Asaduddin Owaisi
MIM
Arun Goel
BJP
  • Loading...

More Telugu News