Mrunal Thakur: ప్రభాస్ సరసన మెరవనున్న మృణాల్ ఠాకూర్!

Mrunal Thakur in Prabhas Movie

  • 'సీతా రామం'తో హిట్ కొట్టిన మృణాళ్ 
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'ఫ్యామిలీ స్టార్'
  • ప్రభాస్ సినిమా నుంచి వచ్చిన ఆఫర్ 
  • దర్శకత్వం వహించనున్న హను రాఘవపూడి   

మృణాల్ ఠాకూర్ .. 'సీతారామం' సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. 'హాయ్ నాన్న' సినిమాతోను ఆకట్టుకున్న మృణాల్, విజయ్ దేవరకొండ జోడీగా త్వరలో 'ఫ్యామిలీ స్టార్' సినిమాతో పలకరించనుంది. 
 
'ఫ్యామిలీ స్టార్' సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ప్రభాస్ సరసన నాయికగా ఆమె భారీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ నుంచి నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో 'కల్కి' .. మారుతీ డైరెక్షన్ లో 'రాజా సాబ్' ఆడియన్స్ ను పలకరించనున్నాయి. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి సినిమాను, హను రాఘవపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. 'సీతా రామం' సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారట. కథానాయికగా మృణాల్ ఎంపిక జరిగిపోయిందనే అంటున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. 

Mrunal Thakur
Prabhas
Hanu Raghvapudi
  • Loading...

More Telugu News