Ananya Nagalla: అందాల అనన్యకి అదృష్టం కలిసొచ్చినట్టే!

Ananya Nagalla Special

  • చారడేసి కళ్లతో ఆకట్టుకునే అనన్య నాగళ్ల 
  • ఆమె తాజా చిత్రంగా రానున్న 'తంత్ర'
  • అనన్య బిజీ కావడం ఖాయమంటూ వినిపిస్తున్న టాక్


అనన్య నాగళ్ల .. యూత్ లో ఇప్పుడు ఈ పేరుకి మంచి క్రేజ్ ఉంది. 'మల్లేశం' .. 'వకీల్ సాబ్' సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆకర్షణీయమైన ఆమె కళ్లకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'తంత్ర' సిద్ధమవుతోంది. నాయిక ప్రధానమైన కథగా ఇది నడవనుంది. 

ఈ నెల 15వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఒక అందమైన గ్రామీణ యువతిపై చేసే క్షుద్ర ప్రయోగంగా ఈ కథ ముందుకు వెళుతుంది. ఆమెను టార్గెట్ చేసింది ఎవరు? క్షుద్రశక్తి ఆవహించిన ఆ యువతి ఏం చేస్తుందనేది సస్పెన్స్. తాంత్రిక శక్తి ఉపాసనకు సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. 

 కథ అంతా కూడా అనన్య పాత్ర చుట్టూనే తిరగనుంది. అందువలన ఈ సినిమా హిట్ అయితే, ఆమె మరింత బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ధృవన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇదే తరహాలో వచ్చిన 'మా ఊరి పొలిమేర' హిట్ కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి.

Ananya Nagalla
Actress
Tantra
Srinivas Gopishetty
  • Loading...

More Telugu News