MLA Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు
![Police Case Registered against BRS MLA Padi Kaushik Reddy In Karimnagar](https://imgd.ap7am.com/thumbnail/cr-20240311tn65eeadaa1b10d.jpg)
- పోలీసులపై అనుచిత వ్యాఖ్యలే కారణం
- కరీంనగర్‌లో ఈ నెల 7న కేటీఆర్, కౌశిక్ రెడ్డి సమావేశం
- తాము తిరిగి అధికారంలోకి వస్తే.. పోలీసులకు వడ్దీ సహా చెల్లిస్తామని హెచ్చరిక
- కౌశిక్ రెడ్డిపై ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేయడంతో కరీంనగర్‌లో ఆయనపై కేసు నమోదయింది. ఈ నెల 7వ తేదీన కరీంనగర్‌లో కార్యకర్తలు, ముఖ్యనేతలతో కేటీఆర్, కౌశిక్ రెడ్డిలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. తాము మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామని అప్పుడు పోలీసులకు వడ్దీ సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
ఇలా పోలీసులపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పట్టణానికి చెందిన ఆశిష్ గౌడ్ అనే వ్యక్తి కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులను కించపరిచేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు. ఆశిష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.