Naatu Naatu Song: ఆస్కార్ వేదికపై మళ్లీ మెరిసిన ‘నాటునాటు’.. వీడియో ఇదిగో!

Jr NTR and Ram Charan Naatu Naatu makes a cameo at Oscars 2024

  • గత వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘నాటునాటు’ పాట
  • నేటి వేదికపై అదే విభాగంలో అవార్డు ప్రకటించినప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘నాటునాటు’ పాట ప్రదర్శన
  • వీడియో షేర్ చేసిన ట్రిపులార్ టీం
  • ఈసారి ‘బార్బీ’ సినిమాలోని ‘వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కింద పురస్కారం

ఆస్కార్ వేదికపై మన పాట మరోమారు మెరిసింది. గత వేడుకల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకున్న ట్రిపులార్ మూవీలోని ‘నాటునాటు’పాట నేటి ఆస్కార్ వేదికపైనా సందడి చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు అవార్డు అందజేస్తున్న సమయంలో వేదికపైనున్న బిగ్ స్క్రీన్‌లో ఈ పాటను ప్రదర్శించారు.   

ఆస్కార్ 2024లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ను ప్రకటించేందుకు అరియానా గ్రాండే, సింథియా ఎరివో స్టేజిపైకి చేరుకున్నప్పుడు గతేడాది విజేతగా నిలిచిన ‘నాటునాటు’ పాట బిగ్‌స్క్రీన్‌పై తళుక్కున మెరిసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ అధికారిక పేజీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఆస్కార్ వేదికపై మరోమారు’ అని దానికి క్యాప్షన్ తగిలించి మూడు ఫైర్ ఎమోజీలను జోడించింది. 

కాగా, ఈ ఏడాది బిల్లీ ఇల్లిస్, ఫిన్నీ ఒ‘కానెల్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అందుకున్నారు. గ్రెటా గెర్విగ్స్ దర్శకత్వం వహించిన ఫాంటసీ, కామెడీ మూవీ బార్బీ’లోని ‘వాట్ వజ్ ఐ మేడ్ ఫర్’ పాటకు గాను వారికీ పురస్కారం లభించింది.

More Telugu News