Bandi Sanjay: చీపురుతో బీఆర్ఎస్ ను ఊడ్చిపారేసినా సిగ్గు రాలేదు: కేటీఆర్ పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay fires on KTR

  • కేటీఆర్, బండి సంజయ్ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు
  • కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు రావాలన్న కేటీఆర్
  • ఎన్నికల్లో ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేస్తారా అంటూ బండి సంజయ్ రిప్లై
  • కేటీఆర్ కండకావరంతో మాట్లాడుతున్నాడని ఆగ్రహం

కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు వస్తాం... డేట్, టైమ్ ఫిక్స్ చేయాలంటూ బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్ విసరగా... వచ్చే ఎన్నికల్లో మీరు ఓడిపోతే బీఆర్ఎస్ ను మూసేస్తారా అంటూ కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో బండి సంజయ్ మరోసారి స్పందించారు. మొన్నటి ఎన్నికల్లో చీపురుతో బీఆర్ఎస్ పార్టీని ఊడ్చిపారేసినా సిగ్గురాలేదని విమర్శించారు. ఏ ముఖం పెట్టుకుని కదనభేరి నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో పర్యటించిన సందర్భంగా బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ కండకావరంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. నేను లోక్ సభ సమావేశాలకు వెళ్లానో, లేదో పార్లమెంటు రికార్డులు పరిశీలిస్తే తెలుస్తుందని హితవు పలికారు.

Bandi Sanjay
KTR
BJP
BRS
Telangana
  • Loading...

More Telugu News