Doctor: ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి దిగంబరావతారం.. హడలిపోయి పరుగులు తీసిన రోగులు, వారి బంధువులు

Doctor walks naked in hospital and terrorised patients and their relatives

  • మహారాష్ట్రలో ఘటన
  • డాక్టర్ వికృత చర్యలు సీసీటీవీలో నమోదు
  • చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఆర్యోగ శాఖ

ఓ ప్రభుత్వ వైద్యుడు ఒంటిపై బట్టలు లేకుండా నగ్నంగా ఆసుపత్రిలో తిరుగుతూ అందరినీ హడలగొట్టిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. 45 ఏళ్ల వయసున్న ఆ వైద్యుడు ఛత్రపతి శంభాజీనగర్ లోని బిడ్కిన్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. 

అయితే, రోగులు, వారి బంధువులు ఆసుపత్రిలో ఉన్న సమయంలో సదరు వైద్యుడు నగ్నంగా కారిడార్ లోకి రావడంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. డాక్టర్ గారి దిగంబరావతారం చూసి రోగులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఆ డాక్టర్ అరాచకత్వం సీసీటీవీలో నమోదైంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

ఈ విషయం జిల్లా ఆరోగ్య శాఖ దృష్టికి వెళ్లింది. జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ దయానంద్ దీనిపై స్పందిస్తూ, ఈ అంశాన్ని పరిశీలిస్తున్నామని, డాక్టర్ నిర్వాకంపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఆ వైద్యుడు మద్యం మత్తులో నగ్నంగా ఆసుపత్రిలో తిరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

More Telugu News