Jayasudha: ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడగొద్దు: నటి జయసుధ

Jayasudha Interview

  • సహజనటిగా జయసుధకు పేరు 
  • గతంలో కమల్ తో పెళ్లి ప్రచారంపై ప్రశ్న
  • అసహనానికి లోనైన జయసుధ
  • గతంలో జరిగిన ప్రచారంపై క్లారిటీ


జయసుధ .. నటిగా దశాబ్దాల ప్రయాణం ఆమె సొంతం. ఎన్నో అవార్డులు .. బిరుదులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. అలాంటి జయసుధ తాజాగా 'ఐ డ్రీమ్'వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. కమల్ తో ఆమె పెళ్లంటూ అప్పట్లో జరిగిన ప్రచారంపై ఆమెకి ప్రశ్న ఎదురైంది. ఆ మాటకి ఆమె చాలా అసహనానికి లోనయ్యారు. అసహనాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే  సమాధానమిచ్చారు. 

"ఇప్పుడు ఆ విషయం అవసరమా? చాలామంది ఏనాటి సంగతులను గురించో ఇప్పుడు అడుగుతున్నారు. నేను .. కమల్  అప్పట్లో  బాలచందర్ గారి సినిమాల్లో వరుసగా నటించాము. ఆ సినిమాలకి సంబంధించిన పాటలను స్టేజ్ పై పాడాము. నిజానికి కమల్ చాలా మంచి సింగర్. ఆయనతో పాటు నేను పాడేదానిని. చూడటానికి మా పెయిర్ బాగుండేది. అందువలన మేము జంటగా ఉంటే బాగుంటుందని కొంతమంది అనుకుని ఉండొచ్చు" అన్నారు. 

"అప్పట్లో ఈ విషయం తమిళ పేపర్లు రాసి ఉండొచ్చు. ఏదో ఒకటి రాయకపోతే ఎలా? అందువలన అలాంటి ప్రచారం జరిగి ఉంటుంది. అసలు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారనే చాలామంది ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెబుతున్నానని నన్ను అడుగుతున్నారు. నేను గొప్పనటిని అన్నందుకు సంతోషం. కానీ ఇలాంటి తిరకాసు ప్రశ్నలు అడిగితే మాత్రం సమాధానం చెప్పను" అన్నారు.

Jayasudha
Actress
Kamal Haasan
  • Loading...

More Telugu News