Rajamouli: ఈ సినిమా నాకు బాగా నచ్చింది: రాజమౌళి

Rajamouli about Premalu movie

  • 'ప్రేమలు' పేరుతో విడుదలైన మలయాళం సూపర్ హిట్ సినిమా
  • తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తికేయ
  • రీను పాత్ర చేసిన అమ్మాయి తనకు బాగా నచ్చిందన్న రాజమౌళి

'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలతో దర్శకుడు రాజమౌళి ప్రపంచ స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రాజమౌళి ఎంతో మంది హీరోయిన్లతో పని చేశారు. తనకు నచ్చిన హీరోయిన్ అనుష్క అని గతంలో ఆయన చెప్పారు. ఇప్పుడు అనుష్క తర్వాత తనకు నచ్చిన హీరోయిన్ ఎవరో చెప్పారు.  

ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన 'ప్రేమలు' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేశారు. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక ట్వీట్ చేశారు. సినిమా తనకు బాగా నచ్చిందని చెప్పారు. ట్రైలర్ చూసినప్పుడే రీను పాత్ర చేసిన అమ్మాయి తనకు బాగా నచ్చిందని తెలిపారు. 

Rajamouli
Tollywood
Kollywood
Premalu Movie
  • Loading...

More Telugu News