Devineni Avinash: సీఎం జగన్ కు దేవినేని ఉమ సవాల్

Devineni Uma challenge to Jagan

  • జగన్ రెడ్డి చిన్నప్పుడే చంద్రబాబు అభివృద్ధిని పరిచయం చేశారన్ని దేవినేని
  • రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ నాశనం చేసిందని విమర్శ
  • అభివృద్ధి, సంక్షేమంపై లోకేశ్ తో చర్చకు రావాలని సవాల్

వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నాశనం అయిందని టీడీపీ నేత దేవినేని ఉమ విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై తమ యువనేత లోకేశ్ తో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సజ్జలనో, విజయసాయినో చర్చకు పంపుతామంటే కుదరదని... జగనే చర్చకు రావాలని అన్నారు. 

టీడీపీ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు చక్రాల్లా పరుగులు పెట్టాయని దేవినేని ఉమ చెప్పారు. సీఎం జగన్ చిన్నగా ఉన్నప్పుడే అభివృద్ధిని చంద్రబాబు పరిచయం చేశారని తెలిపారు. టీడీపీ హయాంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలను వెళ్లగొట్టి, రాష్ట్ర భవిష్యత్తును వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని దుయ్యబట్టారు. చెత్తపై కూడా పన్ను వేసిన జగన్ ను ప్రజలు తరిమి కొడతారని అన్నారు.

Devineni Avinash
Chandrababu
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
  • Loading...

More Telugu News