Rapaka Vara Prasad: అమలాపురం పార్లమెంటు స్థానంకు రాపాక వరప్రసాద్.. రాజోలు బరిలో గొల్లపల్లి సూర్యారావు.. వైసీపీ తాజా జాబితా!  

Rapaka Varaprasad appointed as Amalapuram Lok Sabha segment YSRCP Incharge

  • ముగ్గురి పేర్లతో తాజా జాబితా విడుదల చేసిన వైసీపీ
  • రెండు ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానానికి ఇన్చార్జిల నియామకం  
  • కర్నూలు లోక్ సభ స్థానం ఇన్చార్జిగా బీవై రామయ్య

ఏపీ అధికార పక్షం వైసీపీ విడతల వారీగా తన అభ్యర్థులను ప్రకటిస్తోంది. ఇవాళ ముగ్గురి పేర్లతో మరో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు ఎంపీ స్థానాలకు, ఒక ఎమ్మెల్యే స్థానానికి ఇన్చార్జిలను ప్రకటించారు. అమలాపురం పార్లమెంటు స్థానం వైసీపీ ఇన్చార్జిగా రాపాక వరప్రసాద్ ను ప్రకటించారు. రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఈసారి ఎన్నికల్లో రాపాక లోక్ సభకు పోటీ చేస్తున్నందున, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. ఇక, కర్నూలు పార్లమెంటు స్థానం ఇన్చార్జిగా బీవై రామయ్య పేరును జాబితాలో పేర్కొన్నారు.

More Telugu News