NBK109: ఇది కల్ట్ సరుకు... బాలకృష్ణ 109వ చిత్రం గ్లింప్స్ విడుదల

Glimpse from NBK109 out now

  • బాలకృష్ణ 109వ చిత్రానికి బాబీ దర్శకత్వం
  • సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లలో చిత్రం
  • మహా శివరాత్రి సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్ కు కానుక

టాలీవుడ్ సీనియర్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ మహా శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్ ను ఫిలింమేకర్స్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇది 'కల్ట్ సరుకు' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. 

ఇక గ్లింప్స్ వీడియో చూస్తే... "ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా" అని విలన్ అడగ్గా... "సింహం నక్కల మీదికి వస్తే వార్ అవదురా లఫూట్... ఇటీజ్ కాల్డ్ హంటింగ్" అని బాలకృష్ణ తనదైన శైలిలో పలికిన డైలాగ్ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించడం ఖాయం. సితార ఎంటర్టయిన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. 

ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ఎవరిదో కాదు... దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అర్ధాంగి సాయి సౌజన్య ఈ బ్యానర్ కు అధినేత. నాగవంశీతో కలిసి ఆమె తాజాగా బాలకృష్ణ 109వ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

NBK109
Glimpse
Balakrishna
Bobby Kolli

More Telugu News