Sudha Murthy: సుధామూర్తికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్

AP CM Jagan congratulates Sudha Murthy

  • పెద్దల సభకు వెళుతున్న సుధామూర్తి
  • సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
  • సుధామూర్తి మరింత ఉన్నత శిఖరాలు అందుకోవాలంటూ సీఎం జగన్ ట్వీట్

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అర్ధాంగి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమెను రాజ్యసభకు నామినేట్ చేశారు. దీనిపై ఏపీ సీఎం జగన్ స్పందించారు. "అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే రాజ్యసభకు నామినేట్ కావడం పట్ల సుధామూర్తి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దాతృత్వంలోనూ, సామాజిక కార్యకర్తగానూ, వ్యాపారవేత్తగా, రచయితగా సుధామూర్తి సేవలు నిరుపమానం. ఆమె తన భవిష్యత్ కార్యక్రమాలలోనూ మరింత ఉన్నత శిఖరాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Sudha Murthy
Jagan
Rajya Sabha
Infosys
  • Loading...

More Telugu News