Ajith: అజిత్ కు జరిగింది బ్రెయిన్ సర్జరీ కాదట.. క్లారిటీ ఇచ్చిన అజిత్ అధికార ప్రతినిధి

Clarity on Actor Ajith brain tumor

  • అజిత్ బ్రెయిన్ లో ట్యూమర్ అంటూ వార్తలు
  • బ్రెయిన్ ట్యూమర్ కాదన్న అజిత్ అధికార ప్రతినిధి
  • చెవిని, మెదడును కలిపే నరం వాచిందని వెల్లడి

ప్రముఖ తమిళ హీరో అజిత్ కు బ్రెయిన్ సర్జరీ జరగిందని, ట్యూమర్ తొలగించారనే వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆయనకు జరిగింది బ్రెయిన్ సర్జరీ కాదని ఆయన అధికార ప్రతినిధి సురేశ్ చంద్ర తెలిపారు. చెవిని, మెదడును కలిపే నరం కొంచెం వాచిందని దానికి వైద్యులు చిన్నపాటి ప్రొసీజర్ ద్వారా ట్రీట్మెంట్ చేశారని చెప్పారు. ప్రస్తుతం అజిత్ ఆరోగ్యంగానే ఉన్నారని... ఐసీయూ నుంచి ఆయన వార్డ్ కు నడుచుకుంటూ వెళ్లారని తెలిపారు. ఈరోజు రాత్రి కానీ, రేపు కానీ అజిత్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని చెప్పారు. మరోవైపు ఆర్ట్ డైరెక్టర్ మిలాన్ ఆకస్మిక మరణం పట్ల అజిత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని సురేశ్ చంద్ర తెలిపారు.

Ajith
Kollywood
  • Loading...

More Telugu News