: బెట్టింగు రుచి చూసిన శిల్పా శెట్టి
ఐపీఎల్ బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్నటివరకు రాజస్థాన్ రాయల్స్ సహ యజమాని రాజ్ కుంద్రానే బెట్టింగుకు పాల్పడ్డారని స్పష్టమయింది. ఇప్పుడు బాలీవుడ్ నటి, ఆయన సతీమణి శిల్పాశెట్టి కూడా బెట్టింగ్ వ్యవహారంలో పాలుపంచుకున్నారని పలు ఆరోపణలు, అనుమానాలు వినవస్తున్నాయి. ఈ క్రమంలో దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేందుకు శిల్పను కూడా ప్రశ్నిస్తామని అంటున్నారు. కాగా, గురువారం కుంద్రాను విచారించినప్పుడే పలు విషయాలు బయటికొచ్చాయి. మరోవైపు, కుంద్రా బెట్టింగుకు పాల్పడినట్టు ఒప్పుకోవడంతో ఐపీఎల్ నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టును బీసీసీఐ రద్దుచేసే అవకాశం వుంది.