Rajasthan: మ‌హాశివ‌రాత్రి వేడుక‌ల్లో అప‌శ్రుతి.. క‌రెంట్ షాక్‌తో 14 మంది చిన్నారుల‌కు గాయాలు

14 Children Suffer Electric Shock During Mahashivratri Procession In Rajasthan Kota

  • మ‌హా శివ‌రాత్రి రోజున రాజ‌స్థాన్‌లోని కోటాలో విషాద ఘ‌ట‌న‌
  • గాయ‌ప‌డిన 14 మందిలో ఇద్ద‌రు చిన్నారుల ప‌రిస్థితి విష‌మం
  • ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వైద్యారోగ్య‌శాఖ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్ వెల్ల‌డి
  • హైటెన్ష‌న్ ఓవ‌ర్ హెడ్ విద్యుత్ లైన్ కార‌ణం కావొచ్చ‌ని పోలీసుల అనుమానం

రాజ‌స్థాన్‌లోని కోటాలో విషాద ఘ‌ట‌న జ‌రిగింది. మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల్లో అప‌శ్రుతి చోటు చేసుకుంది. క‌రెంట్ షాక్‌తో 14 మంది చిన్నారుల‌కు గాయల‌య్యాయి. గాయ‌ప‌డిన చిన్నారుల‌ను వెంట‌నే చికిత్స కోసం స‌మీపంలోని ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే, చికిత్స పొందుతున్న 14 మందిలో ఇద్ద‌రు చిన్నారుల ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి హీరాలాల్ న‌గ‌ర్ తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాదం అలముకుంది. 

ఈ దుర్ఘ‌ట‌న‌పై మంత్రి హీరాలాల్ మీడియాతో మాట్లాడుతూ, ఇది చాలా బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న అని అన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయ‌ప‌డ‌డం క‌లిచి వేసింద‌ని తెలిపారు. ఓ చిన్నారికైతే 100 శాతం కాలిన గాయాలు ఉన్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. మిగిలిన వారికి 50శాతం కంటే త‌క్కువ కాలిన గాయాలు అయిన‌ట్లు చెప్పారు. ప్ర‌త్యేక వైద్యుల బృందంతో చికిత్స అందిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. క‌రెంట్ షాక్‌కు గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కాగా, ఈ ఘ‌ట‌న‌కు హైటెన్ష‌న్ ఓవ‌ర్ హెడ్ విద్యుత్ లైన్ కార‌ణం కావొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News