Mahesh Babu: లేజర్ ఫోకస్... రియల్ స్లిమ్ ఫొటో పంచుకున్న మహేశ్ బాబు

Mahesh Babu shares his real slim pic

  • తన లుక్ మార్చుకోవడంపై ఫోకస్ పెట్టిన మహేశ్ బాబు
  • జర్మనీ వైద్య నిపుణుడి సలహాలు పాటిస్తున్న వైనం
  • త్వరలో రాజమౌళితో మహేశ్ బాబు సినిమా

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గత కొంతకాలంగా తన లుక్ మార్చుకోవడంపై తీవ్రంగా దృష్టి పెట్టారు. వీలు దొరికితే  జిమ్ లో కసరత్తులు, విరామం దొరికితే జర్మనీ వెళ్లి ప్రత్యేక వైద్య నిపుణుడి పర్యవేక్షణలో ట్రెక్కింగ్ లు, వగైరాలు చేస్తున్నారు. అగ్రదర్శకుడు రాజమౌళితో  సినిమా చేస్తుండడంతో, ఆ సినిమా కోసమే మహేశ్ ఇంతగా శ్రమిస్తున్నాడంటూ టాక్ వినిపిస్తోంది. 

గత కొన్ని సినిమాల్లో మహేశ్ బాబు ఎంతో స్లిమ్ గా కనిపిస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఆయన పంచుకున్న ఫొటో చూస్తే ఇంకా స్లిమ్ గా మారి సరికొత్త మహేశ్ బాబు అనేలా దర్శనమిస్తున్నారు. అంతేకాదు, 'లేజర్ ఫోకస్' (తదేక దీక్ష) అంటూ తన ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు. 

మహేశ్ బాబు ఇటీవలే 'గుంటూరు కారం' చిత్రంతో ప్రేక్షకుల  ముందుకువచ్చారు. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్ తో చేయబోయే చిత్రం స్క్రిప్టుపై పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. అడ్వెంచర్ జానర్ లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రూపొందించనున్నారు.

Mahesh Babu
Laser Focus
Real Slim
Rajamouli
Tollywood

More Telugu News