Ashish: దెయ్యంతో రొమాన్స్ .. 'లవ్ మీ' టీజర్ రిలీజ్!

Love Me Teaser Released

  • హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన 'లవ్ మీ'
  • ఆశిష్ సరసన నాయికగా వైష్ణవి చైతన్య 
  • హైలైట్ గా నిలవనున్న కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్
  •  దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న సినిమా  


దెయ్యం అనే ఒక ఆలోచన చాలామందిని భయపెట్టే ఒక అంశంగానే కనిపిస్తుంది. ఫలానా బంగళాలో దెయ్యం ఉందనే ప్రచారం జరిగితేనే ఆ వైపు వెళ్లడానికి భయపడతారు. చీకటిపడితే ఆ దారిలో వెళ్లడానికి కూడా ఆలోచన చేస్తారు. ఇక కొంతమంది మాత్రం, అందరూ అనుకుంటున్నట్టుగా అక్కడ దెయ్యం ఉందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు.

కానీ ఒక యువకుడు మాత్రం ఫలానా బంగళాలో దెయ్యం ఉందని తెలుసుకుని, దానితో రొమాన్స్ చేయాలనుకుంటాడు. దెయ్యానికి బాయ్ ఫ్రెండ్ గా మారడంలో .. దానితో రొమాన్స్ చేయడంలో ఉండే కిక్ వేరని భావిస్తాడు. ఈ ఆలోచనను అతను తన గాళ్ ఫ్రెండ్ తో షేర్ చేసుకోవడం ఒక ఎత్తయితే, ఆమెను వెంట బెట్టుకుని ఆ దెయ్యం దగ్గరికి వెళ్లడం మరో ఎత్తు. 

ఈ కథాంశంతో రూపొందిన సినిమానే 'లవ్ మీ'. దిల్ రాజు బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, అరుణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ - వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వదిలిన టీజర్, యూత్ లో ఆసక్తిని పెంచుతోంది. కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

Ashish
Vaishnavi Chaitanya
Dil Raju
Keeravani

More Telugu News