Vijay Sethupathi: నెట్ ఫ్లిక్స్ కి విజయ్ సేతుపతి మిస్టరీ థ్రిల్లర్!

Merry Chrismas Movie Update

  • సంక్రాంతికి విడుదలైన 'మెర్రీ క్రిస్మస్'
  • మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
  • కీలకమైన పాత్రలో కత్రినా కైఫ్ 
  • ఈ నెల 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్

విజయ్ సేతుపతి - కత్రినా కైఫ్ ప్రధానమైన పాత్రలుగా 'మెర్రీ క్రిస్మస్' సినిమా రూపొందింది. టిప్స్ ఫిలిమ్స్ వారు నిర్మించిన ఈ సినిమా, మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడుస్తుంది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తమిళ - హిందీ భాషా ప్రేక్షకులను పలకరించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ సినిమాను తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో  స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రీతమ్ - డేనియల్ జార్జ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 

ఈ ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల జైలు జీవితాన్ని పూర్తిచేసుకుని ముంబైకి వెళతాడు. అక్కడతనికి మరియా (కత్రినా) పరిచయమవుతుంది. ఆమె తన భర్తపై కోపంతో, అల్బర్ట్ తో డేట్ చేయడానికిగాను ఇంటికి తీసుకుని వెళుతుంది. అక్కడ జెరోమీ మృతదేహాన్ని చూసి ఆమె షాక్ అవుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారనేది కథ. థియేటర్స్ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాబట్టలేకపోయిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలా మెప్పిస్తుందనేది చూడాలి. 

More Telugu News