YS Jagan: దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడు: సీఎం జగన్

CM Jagan comments on opposition leaders

  • అనకాపల్లి జిల్లా పిసినికాడ వద్ద చేయూత నిధుల విడుదల సభ
  • హాజరైన సీఎం జగన్
  • చంద్రబాబు పేరు చెబితే మోసాలు గుర్తొస్తాయని వెల్లడి
  • దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని వ్యాఖ్యలు 

నాలుగో విడత వైఎస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమం నేడు అనకాపల్లి జిల్లా పిసినికాడ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగిస్తూ చంద్రబాబు, దత్తపుత్రుడి పేర్లు చెబితే ఏం గుర్తొస్తుంది? అని ప్రశ్నించారు. 

చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉండి అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు గుర్తొస్తాయని విమర్శించారు. పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తొస్తుంది, చంద్రబాబు విశ్వసనీయత లేని వాడన్న విషయం గుర్తొస్తుంది అని అన్నారు. 

ఇక, దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే కళంకం అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వివాహ వ్యవస్థకే మాయని మచ్చ అని పేర్కొన్నారు. ఈ విలువలు పాటించని దత్తపుత్రుడు కార్లు మార్చినట్టు భార్యలను మార్చుతాడని వ్యంగ్యం ప్రదర్శించారు. 

చంద్రబాబు, దత్తపుత్రుడు ఇద్దరూ తమ ఫొటోలు, సంతకాలతో 2014లో విడుదల చేసిన మేనిఫెస్టో ఏమైంది... ఓసారి గుర్తుచేసుకుందామా? అని అన్నారు. వీళ్లను నమ్మిన అక్కచెల్లెమ్మలను నాడు నట్టేట ముంచారని, ఇప్పుడు మళ్లీ ఓ పథకానికి మహాశక్తి అంటూ అమ్మవారి పేరు పెట్టి తీసుకువస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు.

YS Jagan
YSR Cheyutha
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News