Gopichand: నన్ను .. ప్రభాస్ ను చూస్తే అలా అనిపిస్తుందంతే: హీరో గోపీచంద్

Gopichand Interview

  • 'భీమా' గా డిఫరెంట్ లుక్ తో  హీరో గోపీచంద్
  • భారీస్థాయిలో రేపు విడుదలవుతున్న సినిమా 
  • యాక్షన్ సీన్స్ హైలైట్ అవుతాయన్న హీరో
  • కథలో కొత్త పాయింట్ ఉందని వెల్లడి   


హీరో గోపీచంద్ - ప్రభాస్ మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. 'మీ ఇద్దరిలో ఎవరికి కోపం ఎక్కువ?' అనే ప్రశ్న తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోపీచంద్ కి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "నిజం చెప్పాలంటే మా ఇద్దరికీ కోపం చాలా తక్కువ. కాకపోతే ఇద్దరం చేస్తూ వెళుతున్నది యాక్షన్ సినిమాలే. అందువలన అదే ఆవేశం బయట కూడా ఉండి ఉంటుందని అనుకుంటారేమో" అని అన్నాడు. 

తన తాజా చిత్రమైన 'భీమా' గురించి గోపీచంద్ మాట్లాడుతూ .. " ఒక కమర్షియల్ సినిమాకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఈ సినిమాలో ఉన్నాయి. కమర్షియల్ సినిమాకి అవసరమైన అన్ని హంగులూ ఈ సినిమాలో ఉన్నాయి. కాకపోతే సెమీ ఫాంటసీ టచ్ కూడా ఉంటుంది. ఇదే ఈ కథలోని కొత్త పాయింట్. ఇంతవరకూ ఇలాంటి సినిమాను నేను చేయలేదు" అని చెప్పాడు. 

"దర్శకుడు హర్ష స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆడియన్స్ ను తప్పకుండా కూర్చోబెడుతుంది. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు. రామ్ - లక్ష్మణ్ .. రవివర్మ .. వెంకట్ కంపోజ్ చేసిన ఫైట్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయి. నైట్ ఎఫెక్ట్ లో చేసిన ఫారెస్టు ఫైట్ గొప్పగా వచ్చింది. లవ్ .. కామెడీ టచ్ ఉన్న ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది" అని అన్నాడు.

More Telugu News