Jhanvi Kapoor: చరణ్ జోడీగా మెరవనున్న జాన్వీ కపూర్!

Jhanvi Kapoor  in Charan Movie

  • 'దేవర' షూటింగులో బిజీగా జాన్వీ కపూర్
  • చరణ్ జోడీగా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్
  • ధ్రువీకరించిన మైత్రీ మూవీస్
  • బుచ్చిబాబు దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి 


బాలీవుడ్ బ్యూటీగా జాన్వీ కపూర్ కి మంచి క్రేజ్ ఉంది. జాన్వీ ఇంతవరకూ బాలీవుడ్ లో చేసిన సినిమాల్లో బ్లాక్ బస్టర్లు లేవనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఆమెకి ఉన్న ఫాలోయింగ్ ఎక్కువ. అలాంటి జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం ఇక్కడి అభిమానులంతా ఎదురుచూశారు. 'దేవర' సినిమాతో త్వరలో వారి నిరీక్షణ ఫలించబోతోంది. 

కొరటాల - ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత జాన్వీ ఇక్కడ మరికొందరు స్టార్స్ తో జోడీ కట్టే అవకాశాలు ఉన్నాయనే టాక్ వచ్చింది. అంతా అనుకున్నట్టుగానే ఆమె ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో పెద్ద ప్రాజెక్టులో అవకాశాన్ని అందుకుంది .. అదీ చరణ్ జోడీగా. 

ప్రస్తుతం శంకర్ సినిమాతో బిజీగా ఉన్న చరణ్, ఆ తరువాత సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాలో జాన్వీని తీసుకోనున్నట్టుగా వార్తలు వచ్చాయి. తాజాగా మైత్రీ మూవీస్ వారు, ఆమెను ఎంపిక చేసిన విషయాన్ని ధ్రువీకరించారు. చరణ్ ఫ్యాన్స్ ను ఖుషీ చేసే విషయమే ఇది. ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి పేరు వినిపిస్తోంది. 

Jhanvi Kapoor
Charan
Buchibabu
  • Loading...

More Telugu News