ISPL: అట్ట‌హాసంగా ఐఎస్‌పీఎల్ ప్రారంభ వేడుక‌లు.. నాటు నాటు పాట‌కు చిందేసిన స‌చిన్‌, చెర్రీ

Ramcharan and Sachin Tendulkar Dance at ISPL Opening Ceremony in Thane

  • ఐఎస్‌పీఎల్ ప్రారంభ వేడుక‌ల్లో సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్ల సంద‌డి 
  • థానేలోని ద‌డొజీ కొన‌దేవ్ స్టేడియానికి భారీగా త‌ర‌లి వ‌చ్చిన అభిమానులు
  • త‌మ స్టెప్పుల‌తో అభిమానులను ఫిదా చేసిన సెల‌బ్రిటీలు 
  • ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా రాంచ‌ర‌ణ్‌, స‌చిన్‌

'ఇండియ‌న్ స్ట్రీట్ ప్రీమియ‌ర్ లీగ్' క్రికెట్ ప్రారంభ వేడుకలు అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ వేడుక‌ల‌లో సెల‌బ్రిటీలు, క్రికెట‌ర్లు సంద‌డి చేశారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట‌కు మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్‌, మెగా ప‌ప‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, బాలీవుడ్ నటుడు అక్ష‌య్ కుమార్‌, త‌మిళ న‌టుడు సూర్య, ర‌విశాస్త్రి కాలు క‌దిపారు. వారు అలా స్టెప్పులు వేస్తుంటే అభిమానులు కేరింత‌లు కొట్టారు. ఇలా కొద్దిసేపు ఈ న‌లుగురు త‌మ స్టెప్పుల‌తో అభిమానుల‌ను ఫిదా చేశారు. మ‌హారాష్ట్రలోని థానేలోని ద‌డొజీ కొన‌దేవ్ స్టేడియంలో ఈ ప్రారంభ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది. 

ఇక ఐఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నీ విష‌యానికి వ‌స్తే.. ఇది టీ10 ఫార్మాట్‌లో టెన్నిస్ బాల్‌తో నిర్వ‌హించ‌డం జ‌రుగుతుంది. ఇందులో హైద‌రాబాద్, ముంబై, బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా, శ్రీన‌గ‌ర్ జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. హైద‌రాబాద్ జ‌ట్టుకు చెర్రీ య‌జ‌మానిగా ఉన్నారు.  

More Telugu News