Tamil Actress Vijayalakshmi: నేను సూసైడ్ చేసుకోబోతున్నా.. సంచలనంగా మారిన తమిళ సినీ నటి వీడియో

Tamil Actress vijayalakshmi video creates flutter
  • నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త తన జీవితం నాశనం చేశాడని ఆవేదన
  • తనతో మూడేళ్ల పాటు రహస్య జీవనం కొనసాగించాడని ఆరోపణ
  • ఇదే తన చివరి వీడియో అని వెల్లడి
  • తన మరణానికి సీమాన్ సమాధానం చెప్పాలని వ్యాఖ్య
తాను ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ ప్రముఖ తమిళ నటి విజయలక్ష్మి నెట్టింట పెట్టిన వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. మంగళవారం ఆమె ఈ వీడియోను విడుదల చేశారు. 

‘‘మీడియా మిత్రులకు నమస్కారం. ఫిబ్రవరి 29న నేను ఓ వీడియో విడుదల చేశా. నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ నాతో మాట్లాడాలని, నాతో కలిసి జీవించాలని కోరా. నేను ఎంతో ఆవేదనతో ఆ వీడియో పంపించా. ఆత్మహత్య చేసుకుంటానని చెప్పా. ఇప్పుడు మార్చి 5వ తేదీ పూర్తయింది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మూడేళ్ల పాటు నాతో రహస్య జీవితాన్ని కొనసాగించారు. నా జీవితాన్ని నాశనం చేశారు. నన్ను నడిరోడ్డుపై వదిలేశారు. ఇప్పుడు నాకు ఎవరూ సహకరించడం లేదు. ఎవరైనా సహకరించినా వారిని తరిమికొడుతున్నారు. ఇప్పుడు కర్ణాటకలో జీవించలేని పరిస్థితుల్లో ఉన్నా. ఇదే నా చివరి వీడియో. నేను ఆత్మహత్య చేసుకోబోతున్నా. కర్ణాటక పోలీసులు తదుపరి వార్త చెబుతారు. నా మరణంపై సీమాన్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది’’ అని ఆమె చెప్పారు.
Tamil Actress Vijayalakshmi
Kollywood
Seeman

More Telugu News