Gummanur Jayaram: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాం

Gummanur Jayaram joins TDP

  • వైసీపీకి గుడ్ బై చెప్పిన మంత్రి జయరాం
  • మంగళగిరిలో జయహో బీసీ సభలో టీడీపీలో చేరిన వైనం
  • జయరాంకు పసుపు కండువా కప్పిన చంద్రబాబు 

మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఈ క్రమంలో, గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ...  టీడీపీలోకి తిరిగి రావడం చాలా సంతోషం కలిగిస్తోందని అన్నారు. బీసీల సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అభిప్రాయపడ్డారు.

Gummanur Jayaram
TDP
Chandrababu
Jayaho BC
Mangalagiri
YSRCP
  • Loading...

More Telugu News