Samantha: అల్లు అర్జున్ తో మరోసారి నటించాలనుకుంటున్నా: సమంత

Samantha says she wants to act with Allu Arjun again

  • ఓ కాలేజ్ ఫంక్షన్ లో పాల్గొన్న సమంత
  • నటనలో తనకు అల్లు అర్జునే స్ఫూర్తి అని వెల్లడి
  • యాక్టింగ్ బీస్ట్ అంటూ బన్నీకి కితాబు

ఓ కళాశాల వేడుకలో పాల్గొన్న నటి సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటనలో మీకు ఇన్ స్పిరేషన్ ఎవరు? అని ప్రశ్నించగా... నటన పరంగా నాకు అల్లు అర్జునే స్ఫూర్తి అని వెల్లడించారు. అల్లు అర్జున్ ఇప్పుడొక యాక్టింగ్ బీస్ట్ గా మారిపోయాడని కితాబునిచ్చారు. అల్లు అర్జున్ తో కలిసి మరోసారి నటించాలనుకుంటున్నానని సమంత తన మనసులో మాట పంచుకున్నారు. అల్లు అర్జున్ తో కలిసి సమంత 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో నటించడం తెలిసిందే. అంతేకాదు, పుష్ప చిత్రంలో 'ఊ అంటావా మావా' బ్లాక్ బస్టర్ సాంగ్ లోనూ నటించింది.

Samantha
Allu Arjun
Acting
Tollywood
  • Loading...

More Telugu News