Madhavi Latha: నిరాహార దీక్షకు దిగిన హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

Madhavi Latha  sat on a hunger strike along

  • సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై చేపట్టిన స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఆపేయాలని డిమాండ్
  • ఈ నిర్మాణం ఆపేస్తున్నట్లు ప్రకటించే వరకు నిరాహార దీక్ష ఆపేదిలేదని హెచ్చరిక
  • ఫ్లై ఓవర్ నిర్మాణాన్ని దారి మళ్లించాలని విజ్ఞప్తి

హైదరాబాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి డాక్టర్ కొంపెల్ల మాధవీలత నిరాహార దీక్షకు కూర్చున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సైదాబాద్ హనుమాన్ దేవాలయంపై చేపట్టిన స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని ఆమె డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు హిందువుల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ నిర్మాణాన్ని ఆపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసే వరకు తన నిరాహార దీక్షను ఆపేది లేదని హెచ్చరించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని దారి మళ్లించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. తక్షణమే తమ డిమాండ్‌పై స్పందించాలన్నారు. సైదాబాద్ హనుమాన్ ఆలయం వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె నిరాహార దీక్షకు కూర్చున్నారు. 

More Telugu News